![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -84 లో......మురళికి నందు వేడి నీళ్ల కాపడం పెడుతుంది. థాంక్స్ నందు అని మురళి చెప్తాడు. నందు వెళ్ళిపోయాక చాలా థాంక్స్ దేవుడా అని మురళి గట్టిగా అరుస్తాడు. కాపడం పెట్టింది నేను అయితే దేవుడికి ఎందుకు థాంక్స్ చెప్తున్నావని నందు అంటుంది. మరొకవైపు నిత్య బర్త్ డే కి సింహాద్రి ఏర్పాట్లు చేస్తాడు. సూర్యకి భువన ఫోన్ చేస్తుంటే అసలు కల్వదు. ఏమైంది చెల్లెమ్మ అని సింహాద్రి అడుగుతాడు. సూర్య ఫోన్ కలుస్తలేదని చెప్తుంది.
నిత్యకి అసలే కోపం జాగ్రత్త అని సింహాద్రి చెప్తాడు. బర్త్ డే కి MLA వస్తాడు. నిత్య రెడీ అయి వస్తుంది. తమ్ముడు ఎక్కడ అని నిత్య అడుగుతుంది. నీ బర్త్ డే కదా ఫుడ్ పంచడానికి వెళ్ళాడని సింహాద్రి కవర్ చేస్తాడు. మరి బావ ఎక్కడ అని నిత్య ఆడుగుతుంది. నీకు గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు ఉన్నాడు తీసుకొని రావడానికి వెళ్ళాడని భువన చెప్తుంది. ఇక కేక్ కట్ చేయబోతు కేక్ ని విసిరేస్తుంది నిత్య. నేను ఎలా కన్పిస్తున్నా మీకు.. తమ్ముడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.. బావ ఆ జానూకి చీరలు గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడని నిత్య కోప్పడుతుంది. అసలు మనం తగ్గి బ్రతకడం ఏంటి నాన్న అని నిత్య కోప్పడుతుంది. బావని ఎందుకు ఆలా వదిలేసారు అని భువనపై నిత్య కోప్పడుతుంది. నిత్య నీకు బర్త్ డే గిఫ్ట్ గా నా కొడుకుని ఇస్తున్నాను. వాడు నీమెడలో తాళి కడుతాడు.. రేపే మీ ఎంగేజ్మెంట్ అని భువన చెప్పగానే నిత్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు జాను వాళ్ళు అందరు గోరింటాకు పెట్టుకుంటారు. గౌతమి డల్ గా ఉండడంతో నువ్వు డాన్స్ చేసి చాలా రోజులు అవుతుంది చెయ్యమని గౌతమిని నందు రిక్వెస్ట్ చేస్తుంది.
దాంతో నలుగురు అక్క చెల్లెలు డాన్స్ చేస్తారు. మరొకవైపు సూర్య దగ్గరికి భువన వస్తుంది. ఎందుకురా చీకటిలో ఉన్నావ్ అంటుంది. నువ్వే నన్ను చీకటిలో ఉంచుతున్నావ్.. నాకు జానూ ఇష్టమని చెప్పాను.. అయిన వినట్లేదని సూర్య అంటాడు. జానూ అంటే ఇష్టమని ఎప్పుడు చెప్పావ్.. రేపు ఒకసారి తనని తీసుకొని రా మాట్లాడుతా అని భువన అనగానే సూర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుందని జానూని ఎత్తుకొని సూర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Godhavari serial, Star Maa, Nitya birthday, Surya and Janu, Telugu serial latest update
![]() |
![]() |